
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో ప్రభాస్
హైదరాబాద్ సమీపంలోని 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరిట అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాజిపల్లిలోని అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో కలిసి హీరో ప్రభాస్ సోమవారం శంకుస్థాపన చేశారు.
ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవతో తనవంతు సామాజక బాధ్యతతో రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు.
ఈ అటవీ ప్రాంతం అభివృద్ధికి తక్షణ సాయంగా
2 కోట్ల రూపాయల చెక్కు ను ప్రభుత్వానికి అందించారు. తర్వాత ఎప్పుడు అవసరమైనా దశలవారిగా తన సహాయాన్ని అందజేస్తానని అన్నారు.
హీరో కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఇంట్లో మూడు మొక్కలు నాటి వెయ్యి ఎకరాల రిజర్వు ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేయలనుకుంటున్నాని ప్రభాస్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
