నువ్వేకావాలి చిత్రానికి 20 సంవత్సరాలు

ఆక్టోబర్,13 2000వ సంవత్సరంలో తరుణ్, రిచా, సాయి కిరణ్ ప్రధాన పాత్రల్లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మనసు మమత, అంజలి, ఆదిత్య-369, దళపతి లాంటి పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన తరుణ్, ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. రిచా, సాయి కిరణ్ లు కూడా ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేశారు.
కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు, స్రవంతి రవికిషోర్లు సంయుక్తంగా నిర్మించారు. మలయాళ చిత్రం ‘నీరమ్’ను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో రచించగా, కోటి సంగీతాన్ని సమకూర్చారు. ఆక్టోబర్,13 2000లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన అన్నీ కేంద్రాల్లో మంచి విజయం సొంతం చేసుకుంది. 20-కేంద్రాల్లో, 200 రోజులు ఆడిన ఈ చిత్రం, 6- కేంద్రాల్లో సంవత్సరం పాటు ఆడింది. మొదటి సినిమాతోనే కథానాయకుడిగా తరుణ్ తనదైన ముద్ర వేశారు. ఈ చిత్రంతో రిచా, సాయి కిరణ్ లు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. కోటీ గారు స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను మైమరిపిస్తూనే ఉంటాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.