25 వసంతాల ‘తెలుగు వీర లేవరా’

‘తేనె మనసులు’ చిత్రంతో 1965వ సంవత్సరంలో వెండితెరకు పరిచయమైన సూపర్ స్టార్ కృష్ణ మొదటి సినిమా హిట్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరస హిట్స్ కొట్టారు. ఆ తర్వాత ఆయన నటించిన గూఢచారి 116, మోసగాళ్ళకు మోసగాడు, ఏజెంట్ గోపి తదితర చిత్రాలు ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసాయి. తెలుగులో గూఢచారి 116 మొదటి డిటెక్టివ్ సినిమా కాగా, మోసగాళ్ళకు మోసగాడు మొదటి ‘కౌ బోయ్’ చిత్రం రెండూ ట్రెండ్ సెట్టర్ చిత్రాలే. ఆయన నటించిన ఏజెంట్ గోపి చిత్రం ఆయనకు ఆంధ్రా జేమ్స్ బాండ్ బిరుదు తెచ్చిపెట్టింది. అలా ఆయన కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని సినిమాలు అందించారు.
వి. రామచంద్రరావ్ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ గారు కథానాయకుడిగా 1974 మే 1న రిలీజ్ అయిన మొదటి తెలుగు కలర్-స్కోప్ చిత్రం “అల్లూరి సీతారామరాజు”. ఆయన కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం. ఆ చిత్రం అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్లను తిరగరాసింది. ఆయన 200వ చిత్రంగా పి.సాంబశివరావు గారి దర్శత్వంలో వచ్చిన ‘ఈనాడు’ సినిమా కూడా ఆయన కెరీర్ లో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. అలాగే ఆయన నటించిన ౩౦౦వ చిత్రం కూడా ఒక మంచి చిత్రంలా నిలిచిపోవాలని కృష్ణ గారు చేసిన ప్రయత్నమే ‘తెలుగు వీర లేవరా’.
ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, రోజా జంటగా నటించిన చిత్రం ‘తెలుగు వీర లేవరా’. ఈ చిత్రం విడుదలై నేటికి {29-09-1995}25 సంవత్సరాలు పూర్తయింది. ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి మార్క్ కామెడి ఈ చిత్రానికి హైలైట్. ఈ సినిమాలోని ‘ముద్దబంతి పువ్వా’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట్లో నానుతూనే ఉంటుంది. ఈ చిత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.