
"కింగ్ నాగార్జున" ముద్దుల తనయుడు "అఖిల్" బుడిబుడి అడుగుల "సిసింద్రి" సినిమా సెప్టెంబర్ 14, 1995 న విడుదలై అప్పుడే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.
"శివ నాగేశ్వరరావు' దర్శకత్వం వహించిన ఈ సినిమాని గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైజెస్ పతాకంపై "అక్కినేని నాగార్జున" నిర్మించారు. "ఎస్ గోపాల్ రెడ్డి" కెమెరా పనితనం, "రాజ్ కోటి"లలో ఒకరైన "రాజ్" సంగీతం, "సిరివెన్నెల సీతారామశాస్త్రి" సాహిత్యం ఈ చిత్ర విజయానికి ఎంతో ఉపయోగ పడ్డాయి.
చిన్ని తండ్రి నిను చూడగా, ఆటాడుకుందాం రా పాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటాయి.
బుడిబుడి అడుగుల "అఖిల్" చేసిన అల్లరి మన కళ్ళముందు ఎప్పుడు కదలాడుతూనే ఉంటుంది.
అప్పట్లో "సిసింద్రి" ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.
అంత చిన్న వయసులో "అఖిల్" తో ఈ సిసింద్రీ సినిమా చేయడం ఎంతో సాహసం సంచలనం.
ఇందులో...నాగార్జున, టబు, ఆమని, బ్రహ్మానందం, పూజ, గిరిబాబు... తదితరులు నటించారు.
తర్వాత అక్కినేని "అఖిల్" హీరోగా 'అఖిల్", "హలో",
"మిష్టర్ మజ్ను" మూడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు "సురేందర్ రెడ్డి" దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి "అఖిల్" సిద్ధమయ్యాడు.
ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా "అక్కినేని అఖిల్" కి ఆల్ ది బెస్ట్ చెబుతుంది "మీడియా9 టాలీవుడ్"