Today marks #3DecadesForBobbiliRaja
— Venkatesh Daggubati (@VenkyMama) September 14, 2020
Feeling very nostalgic! 😇
Thank you to all my fans and everyone who has contributed to the success of the film! I couldn’t have done it without you all! 🙏🎉 pic.twitter.com/2LtGi4rCaR
విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం ‘బొబిలి రాజా’ నేటితో ముప్పయ్యేళ్లు పూర్తి చేసుకుంది.
బి గోపాల్ దర్శకత్వం వహించి, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1990 సెప్టెంబర్ 14 న విడుదలైంది. వెంకటేష్ కెరీర్లో అప్పటికి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. వెంకటేష్, దివ్య భారతి, సత్యనారాయణ, వాణి శ్రీ, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, బాబు మోహన్, గుమ్మడి ప్రధాన తారాగణం.
‘బొబ్బిలి రాజా’ చిత్రానికి సంగీత స్కోరు ఇలయరాజా చేశారు. "బలపం పట్టి భామ ఒళ్ళో" సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా కి ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమా డైలాగ్స్ పరుచురి బ్రదర్స్ రాశారు. వెంకటేష్ చెప్పిన "అయ్యో అయ్యో అయ్యయ్యో.." డైలాగ్ కి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసిన బొబ్బిలి రాజా 3 సెంటర్లలో 175 రోజుల రన్ అయింది. ఇది వెంకటేష్ కి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ చిత్రం. బొబ్బిలి రాజా వెంకటేష్ కి 200 రోజుల పాటు నడిచిన మొదటి చిత్రం కూడా. జగదీక వీరుడు అతిలోక సుందరి తర్వాత 1990 లో అత్యధిక వసూళ్లు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. బొబ్బిలి రాజా తరువాత తమిళంలో "వాలిబాన్" మరియు హిందీలో "రాంపూర్ కా రాజా" పేర్లతో డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా హిట్ అయింది. ఈ చిత్రం 1993 లో బాయ్ ఫ్రెండ్ పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది.