
ప్రముఖ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎమ్.ఎస్.శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూవీ ట్రెయిన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై వివేక్ రంగాచారి నిర్మిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసారు.
A tale of unorthodoxy, ethnicity and genius! #800MotionPoster is out now - https://t.co/c5NpppFFGJ @VijaySethuOffl #MuthiahMuralidaran #MuralidaranBiopic @movietrainmp #MSSripathy #Vivekrangachari @rdrajasekar @SamCSmusic @proyuvraaj
— Movie Train Motion Pictures (@MovieTrainMP) October 13, 2020
ముత్తయ్య మురళీధరన్ చిన్నతనం నుండి క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతో, ఎన్ని అడ్డంకులు వచ్చినా నిబద్దతతో వాటిని ఎదుర్కొని టెస్ట్ మ్యాచుల్లో 800 విక్కెట్లు తీసిన బౌలర్ గా ఎలా ఎదిగారో చూపిస్తూ చివర్లో ఆయన పాత్రలో ఉన్న విజయ్ సేతుపతి లుక్ తో ఆ మోషన్ పోస్టర్ రూపంలో విడుదలైంది. సినిమా సినిమాకి తనదైన శైలి నటనతో విభిన్నమైన పాత్రలతో తనదైన ముద్ర వేసే విజయ్ సేతుపతి, మురళీధరన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.