
మాన్విత, కుశల కుమార్ సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై రామచంద్ర వట్టికూటి దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీలత, బి. వెంకట్, వెంకట్ బులేమని కొత్త సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో “శరణ్” కథానాయకుడుగా పరిచయమవుతున్నారు. శరణ్ నటుడు సీనియర్ నరేష్ కి మేనల్లుడు అవుతారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు, నవీన్, విజయకృష్ణలు కెమెరా స్విచాన్ చేయగా నరేశ్ క్లాప్ ఇచ్చారు. సుధీర్ బాబు ఆయన సతీమణి ప్రియ స్క్రిప్ట్ ని దర్శకుడు రామచంద్రకు అందించారు. “మా కుటుంబం నుంచి వచ్చిన చాలా మంది నటీనటులను ప్రేక్షకులు ఆదరించారు. శరణ్ ని కూడ ఆదరించాలని కోరుకుంటూ అతనికి అభినందనలు” అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. హీరో శరణ్ మాట్లాడుతూ “కృష్ణ గారి ఆశీస్సులతో మా సినిమా ఆరంభం కావడం ఆనందంగా ఉంది. ఏడాదిన్నరగా నేను, దర్శకుడు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం.” అని అన్నారు. “ కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పిన నిర్మాత వెంకట్ గారికి రుణపడి ఉంటాను. మా టీమ్ సహకారంతో చక్కగా తెరకెక్కించి పరిశ్రమలో నాకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంటాను” అని దర్శకుడు రామచంద్ర అన్నారు. నిర్మాతలు శ్రీలత, వెంకట్ మాట్లాడుతూ “నవంబర్ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జనవరిలోపు సింగిల్ షెడ్యూల్ లో సినిమా మొత్తం పూర్తి చేస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రఘురామ్, ఛాయాగ్రహణం: భరద్వాజ్, పాటలు: సురేష్ గంగుల.
Pics from pooja ceremony of #Cinetaria 's #ProductionNo.3 with Hero #Sharan "TheLight" Kumar
— BARaju (@baraju_SuperHit) October 27, 2020
First Shot Dir. by #SuperStar #Krishna garu
Clap by @itsactornaresh
Script By @isudheerbabu Garu
🎥 Switch @isudheerbabu & #NaveenVijayKrishna Garu#ChandraVattikutti #VenkatBulemoni pic.twitter.com/TxYKHmQ4D6