
యువ కథానాయకుడు నితిన్ మంచి జోరు మీద ఉన్నారు. భీష్మ హిట్ తో ఫామ్ లోకి వచ్చిన ఆయన వరసగా సినిమాలు కమిట్ అయ్యారు. కరోనా కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కమిట్ అయిన చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన తన తదుపరి చిత్రం పై దృష్టి సారించారు. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు.
ఆ చిత్రం తర్వాత ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ తెరకెక్కించిన చిత్రం ‘అంధాదూన్’. ఈ చిత్రం ‘బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే’ విభాగంలో జాతీయ అవార్డ్ అందుకుంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ లో నితిన్ కథానాయకుడిగా నటించనున్నారు. వెంకటాద్రీ ఎక్స్ప్రెస్, రన్ రాజా రన్ చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా నభా నటేష్ నటిస్తుండగా హిందీలో టబు నటించిన నెగిటివ్ రోల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించనున్నారు. ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభం కానుంది.