కలర్ ఫోటో తెలుగు రొమాంటిక్ డ్రామా.. కరోనా కాలంలో థియేట్రికల్ విడుదలకు నోచుకోక OTT ద్వారా రిలీజ్ అవుతున్న మరో చిన్న సినిమా. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన OTT ప్లాట్ఫాం ఆహా కోసం "కలర్ ఫోటో" హక్కులను సొంతం చేసుకున్నారు. అల్లు అరవింద్ కలర్ ఫోటో స్ట్రీమింగ్ రైట్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేశారని టాక్.

కలర్ ఫోటోలో చాయ్ బిస్కెట్ ఫేమ్ సుహాస్ మరియు చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 14 న దీపావళి రోజున ఆహా లో ప్రసారం కానుంది. ఈ సినిమా ను హ్రుదయ కాలేయం మరియు కొబ్బరి మట్టా ఫేమ్ సాయి రాజేష్ రచించి, నిర్మించారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.
సునీల్ ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో సునీల్ చెప్పిన డైలాగ్స్ కూడా హైలైట్ గా ఉన్నాయి..
MM కీరవానీ కుమారుడు కాల భైరవ పాటలకి మంచి స్పందన వస్తోంది.