మిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆయన నటించిన సినిమాలు అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. కథల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తుంటారు సూర్య. ఆయన నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దురా. తెలుగులో ‘గురు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర హక్కుల్ని కొనుగోలు చేసింది. అక్టోబర్ 30న విడుదల చేద్దామనుకున్నారు కానీ కొన్ని కరణాల వాళ్ళ ప్రభుత్వం నుండి రావాల్సిన పెర్మిషన్ లేట్ అయిన కారణంగా సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. తాజాగా నవంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడుతున్నాయి. సూర్య నటన హైలైట్ గా ఉండే అవకాశం ఉంది. సూర్యకు తెలుగులో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పడం విశేషం.