
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచామయ్యారు అందాల తార అదా శర్మ. ఆవిడ ఎక్కడున్నా రెగ్యులర్ గా సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటారు. తన అందం గురించిన, హేయిర్ స్టైల్ గురించిన ఫొటోలని షేర్ చేస్తూ నిరంతరం అభిమానులకి దగ్గరగా ఉంటూంటారు. అంతే కాకుండా తన వర్కౌట్స్, యోగాకి సంబంధించిన వీడియోలు, ఫొటోలని కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అదా శర్మ మరో ప్రయత్నం చేసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో డిస్నీ ప్రిన్సెస్ గా దర్శనమిచ్చారు. పెద్ద ముక్కుపుడకతో పెట్టుకుని సరికొత్త డిజైనర్ డ్రస్ తో అందరినీ ఆకట్టుకున్నారు.చూడగానే అందిరికీ నచ్చేలా ఉంది ఈ మేకోవర్. కర్రసాము ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేస్తూ కుర్రాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. అదా శర్మ చాలా అందమైన అమ్మాయే కాదు. చాలా ధైర్యవంతురాలు, మూగ జీవాల ప్రేమికురాలు తన భావాలని స్వేచ్ఛగా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎంతో మంది మహిళలకి స్ఫూర్తినిస్తూ ఉంటారన్న విషయం ఆమే ట్విటర్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘కల్కీ’ చిత్రంతో తెరమీద కనిపించిన అదా, ఆ తర్వాత ‘ది హాలీడే’ అనే సిరీస్ లో నటించారు.
#PatakAdah looks for this festive season pic.twitter.com/e9pGV2zfy1
— Adah Sharma (@adah_sharma) October 23, 2020