
తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు నటి అదితి రావు హైదరి. చెలియా, సమ్మోహనం, నవాబ్ తదితర చిత్రాలతో ఆవిడ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు అదితి రావు హైదరి. సాహెబా అనే పాత్రలో అదితి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె రోల్ చిన్నదే అయినా ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆవిడ నటించారు. ఈ చిత్రం తర్వాత ఆవిడ తెలుగులో చేయనున్న తదుపరి చిత్రం అధికారికంగా ప్రకటితమైంది. శర్వానంద్ కథానాయకుడిగా ‘ఆరెక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్న విషయం తెల్సిందే.
‘ఆరెక్స్ 100’ చిత్రం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో శర్వానంద్ తో పాటు మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం అదితి రావు హైదరిను తీసుకున్నారు. ఆ విషయాన్ని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ANNOUNCEMENT... #AditiRaoHydari to play the female lead in #MahaSamudram... A #Telugu - #Tamil bilingual... Costars #Sharwanand and #Siddharth... Ajay Bhupathi - who directed #RX100 - to direct this bilingual... Produced by Sunkara Ramabrahmam. pic.twitter.com/fCnVQ1JTt7
— taran adarsh (@taran_adarsh) October 12, 2020