బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ రోజు తన 53 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్కి కి సెలెబ్రెటీలు, స్నేహితులు మరియు అభిమానులు శుభాకాంక్షలతో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. మంచి స్నేహితుడు అయిన అజయ్ దేవ్గన్ ట్విట్టర్లో ముందుగా అక్షయ్ కుమార్ కి విషెస్ తెలిపాడు.. నేహా ధూపియా, అర్జున్ బిజ్లానీ, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ ధోలాకియా, డబ్బూ రత్నాని తదితరులు కూడా అక్షయ్ శుభాకాంక్షలు తెలిపారు.
అక్షయ్ కుమార్ త్వరలో హర్రర్-కామెడీ లక్ష్మీ బాంబ్లో కనిపించనున్నారు, ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రదర్శించబడుతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన హిట్ సినిమా కాంచన కి హిందీ రీమేక్. ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం స్కాట్లాండ్లోని బెల్ బాటమ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. నిజ జీవితంలో నుండి ప్రేరణ పొందిన స్పై థ్రిల్లర్ ఈ సినిమా.
Happy Birthday Akki. I know it’s an on set birthday in Scotland. Stay safe. Best wishes for all times to come🎉@akshaykumar pic.twitter.com/iwPNxnLTOe
— Ajay Devgn (@ajaydevgn) September 9, 2020