
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో శరవేగంగా సాగుతోంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే వేసవికి విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంటున్నారు . ఇక ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు యూనిట్. ఈ మోషన్ పోస్టర్ అదిరిపోయిందని చెప్పాలి.
ముఖ్యంగా ఆ వింటేజ్ ట్రైన్, అందులో ఒక్కో కంపార్ట్మెంట్ లో ఒక్కో జంట, కట్ చేస్తే ట్రైన్ డోర్ వద్ద హీరోయిన్, ఆమెను పట్టుకుని మన హీరో ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ను ప్రేక్షకులకు అందించింది ఈ మోషన్ పోస్టర్. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిగా ఆకట్టుకుంది. చివర్లో వచ్చిన ఒక చిన్న బిట్ సాంగ్ కూడా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.