ఇదివరకు చాలా సినిమాల్లో ఎన్నో బ్రేక్ అప్ గీతాలు వచ్చాయి. ఎంతో సూపర్ హిట్ అయ్యాయి కూడా. సినిమా విజయం విషయంలో బ్రేక్ అప్ గీతాలు ఎంతో ముఖ్య పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. చాలా ప్రేమకథా చిత్రాల్లో బ్రేక్ అప్ పాటలకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే చిత్రం నుంచి మరో బ్రేకప్ సాంగ్ రాబోతుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`.

సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'సింగిల్ ఫర్ ఎవర్' అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన బ్రేకప్ సాంగ్ అక్టోబర్ 15న చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. ఎస్. ఎస్. తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న 'అమృత' అనే గీతాన్ని ఈనెల 15న ఉదయం 10 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నట్టు 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర బృందం ప్రకటించింది. 'అల వైకుంఠపురం' చిత్రం తర్వాత సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నుంచి మరో అద్భుతమైన ఆడియో వస్తుందని ఆశిద్దాం.
#nannnnnnbaaaaaaa 💔 I am sure this song will energise U !#AmruthaSong the break up song 🙌🏿🧘♂️On @IamSaiDharamTej ‘s birthday 🥳 🙋🏽♂️ #oct15’th
— thaman S (@MusicThaman) October 13, 2020
Watch out for the #Hookline Step !! #tej jus danced & rocked it all the way !! 👏🏾👏🏾👏🏾
Woooooohooooo !! 🤍https://t.co/BdJKmpFuSA