అందం శరణం గచ్ఛామి శ్రియ శరణ్ @20

"ఇష్టం" సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రియ
20 సంవత్సరాలని తన అందంతో అందంగా గడిపేసింది.
దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమాల్లోనూ నటించింది.
20 ఏళ్ళ తన ప్రస్తానంలో ఒక నటిగా ఎన్నో గొప్ప పాత్రలు పోషించింది.
అందం, అభినయం కలబోసిన అభినేత్రి అనే చెప్పాలి.
తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి పాత్ర ఔచిత్యానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటూ అప్రతిహతంగా తన ప్రయాణాన్ని సాగించింది.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజనీకాంత్ లాంటి అగ్ర నటులతో నటిస్తూనే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, ఉదయ్ కిరణ్, తరుణ్ తో పాటు ఎంతోమంది యువ హీరోలతో కూడా నటించింది.
అందం పట్ల ఆమెకున్న అవగాహన ఇప్పటి హీరోయిన్లకి
మార్గదర్శకం అనే చెప్పాలి.

సినిమాని ప్రాణంగా ప్రేమిస్తూ, ప్రతీ సినిమాని మొదటి సినిమాగా భావిస్తూ దర్శకులు ఇచ్చిన పాత్రల స్వభావానికి తగ్గట్టుగా నటించి మెప్పించి ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకుంది.
ఇరవై సంవత్సరాలుగా వ్యాయమం,ఆహరపు అలవాట్లకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చి ఉంటుందో తన శరీరాకృతిని చూస్తే అవగతమవుతుంది.వృత్తి పట్ల అంకితభావమే తనకు ఇప్పటికి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇంతటి అంకితభావమున్న నటీమణి "ఇష్టం"అనే మన తెలుగు సినిమా నుండి పరిచయమవడం మన తెలుగు సినిమాకి గర్వకారణం. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు సినిమాలే ఆమెకి ఎక్కువ కీర్తిని తెచ్చిపెట్టాయి.ప్రేక్షకులు కూడా ఆమెని మన తెలుగమ్మాయిలానే ఆదరించారు. పక్కింటి అమ్మాయిలానే భావించారు.అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తూనే ఉన్నారు,చూస్తూనే ఉంటారు.
శ్రియ ఇంకా ఎన్నో ఇలాంటి అందమైన పుట్టినరోజులని జరుపుకోవాలని, తన అందంతో, అభినయంతో మనందరిని అలరించాలని,మరెన్నో మంచి పాత్రల్లో చూడాలని కోరుకుంటూ "శ్రియ శరణ్" కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీడియా9 టాలీవుడ్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.