కోవిడ్ తో పోరాడుతున్న యాంగ్రీ యంగ్ మ్యాన్

కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. తప్పని పరిస్థితుల్లో అందరూ పనుల్లోకి వెళ్తున్నా ముప్పు పొంచివుందని అందరికీ తెలుసు. అయినా తప్పదు రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలెన్నో రోజువారీ వేతనాల పై ఆధారపడి ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ బయపెట్టిన ఈ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని ఒదిలేలా లేదు. సినిమా ఇండస్ట్రీ పై కూడా తన పంజా బలంగానే విసిరిందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల యాంగ్రీయంగ్ మ్యాన్ డా.రాజశేఖర్ ఫ్యామిలీ కరోనా బారిన పడటం పలువురిని షాక్ కి గురిచేసింది. తనతో పాటు భార్య జీవిత, పిల్లలు శివాని, శివాత్మికలు కూడా కరోనా బారిన పడ్డామని అయితే శివాని, శివాత్మిక కోలుకున్నారని రాజశేఖర్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన కుమార్తె శివాత్మిక తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ఆందోళన కలిగించేలా ఉంది. శివాత్మిక మాట్లాడుతూ “ప్రియమైన అందరికీ కోవిడ్ తో నాన్న చేస్తున్న పోరాటం చాలా కష్టంగా వుంది, అయినప్పటికీ ఆయన ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడాయని మేము నమ్ముతున్నాము. నాన్న కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలతో నాన్న తప్పకుండా కోలుకుంటారు” అని శివాత్మిక పెట్టిన పోస్ట్ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. డా.రాజశేఖర్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. ఏది ఏమైనా అందరూ మాస్క్ లు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది. అదే మనల్ని కాపాడుతుంది. కరోనా లేదు ఏమి లేదనే వాదనని పక్కన పెట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవాలన్నదే అందరి సూచన.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.