
మలయాళ బ్యూటీ అను ఇమ్మానుయేల్ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయింది లేదు. మజ్ను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను, ఆ తర్వాత నటించిన సినిమాలు కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాలతో ప్లాపులను అందుకుంది. స్టార్ హీరోలతో నటించినా కానీ ఆమె దశ తిరగలేదు. అయితే తిరిగి టాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది అను. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో అను ఇమ్మానుయేల్ నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇది కాకుండా ఆమె మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేసింది.
The Gorgeous and Talented @ItsAnuEmmanuel joins the lead cast of #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @DirAjayBhupathi @aditiraohydari @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/8Y4cf5qGp1
— AK Entertainments (@AKentsOfficial) October 19, 2020
ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ డ్రామా మహా సముద్రంను అనౌన్స్ చేసారు. సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తుండగా అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు అను ఇమ్మానుయేల్ ను మరో హీరోయిన్ గా అనౌన్స్ చేస్తూ మహా సముద్రం టీమ్ ప్రకటించింది. ఇదే ప్రకటనలో డైరెక్టర్ అజయ్ భూపతి గారు స్క్రిప్ట్ రచనలోనే చాలా జాగ్రత్తగా ప్రతి పాత్రకి వాటి ప్రాముఖ్యత ఉంటుందని, ఈ చిత్రం ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.ఆమె పాత్రకు కూడా సమమైన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు మహా సముద్రం టీమ్. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.