
“అవును” ఫేమ్ , ఢీ షో న్యాయనిర్ణేత పూర్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం “బ్యాక్ డోర్” హైదరబాద్ లో ప్రారంభమైంది. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ “అన్ని రంగాల్లో బ్యాక్ డోర్ అనేది సహాజం అయిపోయింది. అలా బ్యాక్ డోర్ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల అంశాల నేపథ్యంలో ఆసక్తిగా సాగే కథ బ్యాక్ డోర్” అని అన్నారు. కర్రి బాలాజీ అంజలి తో ఆనంద భైరవి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం విడుదల కావాల్సి ఉంది. పూర్ణ లాక్ డౌన్ లో నటిస్తున్న రెండవ చిత్రం ఇది కాగా, తమిళ్ లో బాలా ప్రోడక్షన్ లో కూడా నటిస్తున్నారు. మళయాళ కుట్టి పూర్ణ తెలుగులో ‘సీమటపాకాయ్’ చిత్రంతో హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అవును సినిమా తో లేడి ఒరియెంటెడ్ సినిమాలకు ఫేమ్ అయ్యారు. ఇటు చిత్రాల్లో నటిస్తూ మరో పక్క ఢీ లాంటి షోలతో టెలివిజన్ రంగంలో కూడా బిజీగా ఉన్నారు . పూర్ణ మాట్లాడుతూ “ చాలా రోజుల తర్వాతా నా పాత్ర చాలెజింగ్ అనిపించింది. ఇలాంటి పాత్రలో నన్ను నటింపచేస్తున్నందుకు డైరెక్టర్, ప్రోడ్యూసర్ కి థ్యాంక్స్” అని అన్నారు. వీలైనంతా త్వరగా షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా శ్రీకాంత్, సంగీతం ప్రణవ్.