
తిరువీర్…. టాలివుడ్ లోకి దూసుకు వస్తున్న యువ నటుడు. నాటక రంగంలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మరియు దర్శకుడు. 2016 లో ' బొమ్మల రామారమ్' సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఆరంగేట్రం చేశారు. ఘాజీ, మల్లేశం సినిమాల్లో చిన్నవైన గుర్తుంచుకో దగ్గ పాత్రలు చేశారు. తరువాత 2019 లో వచ్చిన జార్జ్ రెడ్డి అనే సినిమాలో 'లలన్ సింగ్ ' పాత్రను సమర్థవంతంగా పోషించి ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. 2020 లో వచ్చిన ‘పలాస 1978’ చిత్రంలో హీరో సోదరుడు రంగారావు పాత్ర లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల అభిమానంతో పాటు, విమర్శకుల ప్రశంశలు అందుకున్నారు. అలాగే ‘సిన్’ అనే వెబ్ సిరీస్, మెట్రో కథలు అనే ఆంథాలజీ వెబ్ ఫిల్మ్ లోనూ మంచి పాత్రలు వేశారు. ఇప్పుడు కొబ్బరిమట్ట డైరెక్టర్ రూపక్ రోనాల్డ్సన్, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తీస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి ' పరేషాన్' అనే పేరు ఖరారు చేశారు. ఈ మధ్యనే మంచిర్యాలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ ట్యూబ్ లో ఫేమస్ అయిన ‘చౌరస్తా’ బ్యాండ్ సంగీతం అందిస్తుంది.దీనితో పాటు ప్రియదర్శిని రామ్ దర్శకత్వంలో కేస్ 99 అనే చిత్రంలో కూడా నటించారు. ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది..