
సెప్టెంబర్-29-1970వ సంవత్సరంలో జన్మించిన కుష్బూ, 16 సంవత్సరాలకే నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1986వ సంవత్సరం ఆగస్ట్ 14 రిలీజ్ అయిన కలియుగ పాండవులు చిత్రంతో ఆవిడ నటిగా తెరంగేట్రం చేశారు. వెంకటేష్ కథానాయకుడిగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత ఆవిడ నాగార్జున గారి సరసన కెప్టెన్ నాగార్జునలో, త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు, కిరాయి దాదా, మారణ హోమం, స్టాలిన్, యమదొంగ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆవిడ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తి.
సినీ రంగంలో ఎంతో ప్రాముఖ్యత వహించిన కుష్బూ గారు డి.ఎమ్.కె పార్టీ అధినేత కరుణానిధి గారి ఆహ్వనం మేరకు 14-మే-2010. ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత డి.ఎమ్.కె పార్టీకి రాజీనామా చేసి 16-జూన్-2014న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న ఆవిడ ఉన్నట్టుండి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీ.జే.పీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆవిడకు శుభాకాంక్షలు తెలియజేసారు.