
దర్శక ధీరుడు రాజమౌళి గారి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఆ చిత్రం నుంచి విడుదల చేసిన హీరో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటేస్ట్ గా బ్యాక్ టూ షూట్ అంటూ ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఒక వీడియో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి పెంచారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ భీమ్ పాత్ర విడియో కోసం అభిమానులు ఆసక్తిగా వేచి వున్నారు. ఇటీవలే ఈ విడియో వస్తుందని యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో ఆ విడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ మామూలు మనిషి నుంచి కొమరం భీమ్ ఉద్యమకారుడిగా మారిన వైనం చకచకా రకరకాల వేషాల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఈ విషయం చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలియజస్తూ భీమ్ అరైవ్స్ ఇన్ టూ డేస్ అంటూ ట్వీట్ చేసింది. ఈ విడియో కోసమే కొద్ది రోజుల క్రితం ప్రత్యేకంగా
షూటింగ్ మొదలుపెట్టారు. ఆ వీడియో ఎలా ఉండబోతుందో అని దీని మీద ఆసక్తి కరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విడియోలో ఎన్టీఆర్ ను పలు గెటప్స్ లో చూపిస్తారని తెలుస్తోంది.ఈసారి ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే లేటెస్ట్ కంటెంట్ ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ విడియో సోషల్ మీడియాలో ఉన్న రికార్డ్ లను బ్రేక్ చేసే అవకాశం వుంది. ఈ చిత్రం లో ఎన్.టి.అర్, రామ్ చరణ్ తో పాటు, శ్రీయశరణ్, బాలీవుడ్ తారలు ఆలీయభట్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు.