డార్లింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్, ఆరడుగుల ఆజానుబాహూడు, భారత దేశపు రికార్డ్ లు బద్దలు కొట్టిన బాహుబలి ప్రభాస్ రాజు టాలీవుడ్‌ టాప్‌హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఆయన బహుబలి సినిమాతో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగారు. ఇప్పటి వరకు ఒక లెక్క బాహుబలి నుండి ఒక లెక్క అంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఈ చిత్రంతో విశ్వయవనికపై రెపరెపలాడించారాయన. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కూమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించారు ప్రభాస్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ఆయన స్వగ్రామం. ఫ్రభాస్ చెన్నైలో పుట్టారు. ప్రభాస్ కి అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అన్నయ పేరు ప్రభోద్, చెల్లెలు పేరు ప్రగతి. సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ప్రభాస్ కు పెద్దనాన్న. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను భీమవరంలోని డి.ఎన్.ఆర్ స్కూల్ లో పూర్తి చేశారు. బి.టెక్ శ్రీ చైతన్య కాలేజీ
హైదరబాద్ లో పూర్తి చేశారు. జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈశ్వర్’ సినిమా తో తెరంగేట్రం చేశారు. మూడవ చిత్రం ‘వర్షం’ చిత్రంతో బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ కి యూత్ లో ఫాలయింగ్ ఏర్పడింది. 2005 లో రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాతో ఆయన స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఆ చిత్రం అప్పటి వరకు ఉన్న రికార్డ్లను తుడిచిపెట్టేసింది. ఆ చిత్రంతో మాస్ ఆడియన్స్ కు ఆయన బాగా దగ్గరయ్యారు. పూరి జగన్నాథ్
దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో అందరికి డార్లింగ్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్  సినిమాలతో ఫ్యామిలి ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఇక మిర్చి సినిమాతో తెలుగు అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టారు. త్రిషతో కలిసి మూడు సినిమాలు, అనుష్కతో మూడు సినిమాలు, కాజల్ తో రెండు సినిమాలలో నటంచారు. ఇక బాహుబలితో తన రేంజ్ తో పాటు తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారు. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్స్, ప్రోడ్యూసర్స్ సైతం ప్రభాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథల్ని సిద్ధంచేస్తున్నారు. 'ఈశ్వర్‌'తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభాస్‌ సాహో చిత్రం వరకు కూడా వైవిధ్య కథాంశాలతో అనతికాలంలోనే అంతులేని ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. ప్యాన్‌ ఇండియా ప్రభాస్‌ లార్జర్ దెన్‌ లైఫ్‌ అంశాలతో
కూడిన విభిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నారు. ప్రభాస్‌ సినిమా వస్తుందంటే భాషాభేదాలకు అతీతంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్కొక్క సినిమాతో తన ఇమేజ్‌ను విస్తరించుకుంటున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమాతో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా
కూడా చేయబోతున్నారు ప్రభాస్‌. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌, అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రల్ని పోషించనున్నారు. అలాగే పౌరాణిక బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న 'ఆదిపురుష్‌'లో ప్రభాస్‌ హీరోగా నటించబోతున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వంలో దాదాపు ఐదు వందల కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్యాన్‌ ఇండియన్‌ స్థాయిలోనే భారీ హంగులతో ఈ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. హిరోగా ఎంత ఎదిగినా ప్రభాస్ చాలా సింపుల్ గానే ఉంటారు. స్నేహం అంటే ప్రాణమిస్తారు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీస్ కి
డార్లింగ్ అంటే ప్రాణం. ప్రభాస్ కి గోపిచంద్, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. ప్రజలకు, ఫ్యాన్స్ కి ఏదైనా ఆపద వస్తే తన వంతు సహాయం చేయడానికి ప్రభాస్ ఎప్పుడూ ముందుటారు. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు తో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. మేడమ్ టుస్సాడ్ యొక్క మైనపు మ్యూజియంలో మైనపు శిల్పాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. కాగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖుల నుండి అభిమానుల వరకు అందరూ డార్లింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్ నువ్వు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని,నువ్వు చేసే పనులు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. రకూల్ ప్రీత్ సింగ్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ”సూపర్, డూపర్ సక్సెస్ లు ఇంకా చాలా అందుకోవాలని, కెరీర్ అనంత శిఖరాలు ఎదాగాలని” ఆవిడ ట్వీట్ చేశారు. “మన మనసుకు నచ్చె డార్లింగ్ ప్రభాస్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశారు. “ప్రభాస్ అన్న కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రేమానురాగాలు, విజయాలు ఎన్నో కలగాలని కోరుకుంటున్నాను” అంటూ హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

“స్వీటెస్ట్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్ డార్లింగ్ ప్రభాస్ కి బర్త్ డె విషెస్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్” అంటూ హీరో నితిన్ ట్వీట్ చేశారు. “కోట్లాది మంది కి డార్లింగ్ అయిన ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని రాశీ ఖన్నా ట్వీట్ చేశారు. “హ్యాపీయేస్ట్ మ్యూజికల్ బర్త్ డే టూ డార్లింగెస్ట్ డార్లింగ్ “ అంటూ దేవీ శ్రీ ప్రసాద్ తెలియజేశారు.తన ట్విట్టర్ ద్వారా “ నా బ్రదర్, నా ఫ్రెండ్,చాలా నిజాయితి గల మనిషి ప్రభాస్.తనకి పాత్ బ్రెకింగ్ బ్లాక్ బాస్టర్స్ రావలని కోరుకుంటున్నాను ” అని
ట్వీట్ చేశారు. కాజల్ కూడా ట్విట్టర్ లో ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ అన్న కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, తన కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా
కోరుకుంటూ రెబల్ స్టార్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిజేస్తోంది మీడియా9.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.