
తన స్టన్నింగ్ లుక్స్ తో అభిమానుల్ని సొంతం చేస్కున్నారు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. ముకుంద చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన కంచే లాంటి పీరియాడిక్ డ్రామాలో సైనికుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. గద్దలకొండ గణేష్ చిత్ర విజయం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.
యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు వెంకటేష్, సిద్ధూ ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నారు. VT10 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ మేకోవర్ అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ నటిన్చనున్నారు. ఈ చిత్రానికి జార్జ్. సి. విలియమ్స్ చాయాగ్రహణం. తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నుండి మొదలవ్వబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. వీలైన్తంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి జనవరి 2021 లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: తమన్, చాయాగ్రహణం: జార్జ్. సి. విలియమ్స్, నిర్మాతలు: అల్లు వెంకటేష్, సిద్ధూ ముద్ద, రచనా దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.