
వరస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు నేడు. తన అందంతో, అభినయంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన పూజా 2010లో మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశం నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచారు. 2012లో 'ముగమూడి' అనే తమిళ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ముకుంద, ఒక లైలా కోసం, లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తక్కువ కాలంలోనే దాదాపుగా తెలుగు స్టార్ హీరోలందరితోనూ ఆవిడ తెరను పంచుకున్నారు. హృతిక్ రోషన్ 'మెహంజదారో' చిత్రంతో హిందీ సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత దువ్వాడ జగన్నాథమ్, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, హౌస్ ఫుల్-4, అల వైకుంఠపురం లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్నారు పూజా హెగ్డే.
ప్రస్తుతం ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తున్న ఈ బుట్టబొమ్మ అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలోనూ నటిస్తున్నారు. ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఆవిడ చేతిలో ఉన్నాయి. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆవిడకు శుభాకాంక్షలు తెలిచేశారు.