Wishing the Darling of millions, Our Super Hero #Prabhas a very Happy Birthday. 🎉
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 23, 2020
By next birthday, we will definitely give you something to look forward to :)#HappyBirthdayPrabhas
రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు ఇండస్ట్రీ నుండే కాక అన్ని భాషల నుండి ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ నుండి మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ప్రముఖ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమాపై అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఇదే టైమ్ కు ఈ సినిమా నుండి ఏదొక గిఫ్ట్ అభిమానులకు ఉంటుంది అన్న తరహాలో స్పందించింది.