
ఇటీవల కాలంలో హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ లాంటి మాధ్యమాల్లో వారు చేసే పోస్ట్ లకి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. సామాన్యుల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ చేరిపోవడంతో సెలెబ్రిటీలకీ సామాన్యులకి మధ్య దూరం చెరిగిపోయింది. ఇటీవల ఉపాసన, సమంత లు ఆరోగ్యానికి సంబంధించిన విషయోల్ని పంచుకునేందుకు వెబ్ సైట్ లో అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఛార్మి కౌర్ కూడా వీరి సరసన చేరిపోయారు. గత కొంతకాలంగా మేకప్ కి సంబంధించిన హెయిర్ స్టైల్స్ గురించి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చార్మి కౌర్ కొత్త మేకోవర్ లుక్ లో అప్ కమింగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. తన కొత్త మేకోవర్ లుక్ లో ఉన్న వీడీయోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. చార్మీ కొత్త మేకోవర్ లుక్ నెటిజన్లని ఎంతగానో ఆకర్షిస్తుంది. బై బై లాక్ డౌన్ అంటూ... మీకు జీవితంపై మక్కువ ఉంటే హెయిర్ స్టైల్ ని మార్చండి అంటూ కూడా తన అభిప్రాయాన్ని రాసి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు చార్మి.
Bye bye lockdown mess .. I m in love with this super fun new creation 🤩
— Charmme Kaur (@Charmmeofficial) October 21, 2020
Love u @dimnadim for this crazy edit 😘😘
.
.#newlook #feelsgood 😍 pic.twitter.com/1fqTtsYDPk