
చిరంజీవి గారు పుట్టిన రోజు సందర్బంగా 'ఆచార్య ' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ లుక్ లో అదిరిపోయేంత విషయం ఉందని అనిపించింది. ఎందుకంటే కొరటాల దర్శకత్వంలో వచ్చిన గత సినిమాల్లో సినిమా మొత్తానికి ఏదొక హైలైట్ ఫైట్ సీన్ ఉంటుంది. మిర్చి రైన్ ఫైట్, శ్రీమంతుడు మామిడి తోట ఫైట్, జనతా గ్యారేజ్ లో గవర్నమెంట్ ఆఫీస్ ఫైట్, భరత్ అనే నేను లో దుర్గమహల్ ఫైట్.. అవన్నీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చాయి.. అలానే ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా అలాంటి హైలైట్ గా నిలిచే ఫైట్ సీన్ లో నుండి ఈ స్టిల్ రిలీజ్ చేశారు అనిపిస్తుంది.
పోస్టర్ ఇంకా క్లియర్ గా గమనిస్తే ధర్మస్థలి అనే ఊరు లో ఉన్న మనుషుల కోసం హీరో అయిన మన మెగాస్టార్ గారు పోరాటం చేస్తున్నారనిపించింది. మెగాస్టార్ సినిమా కి చాలా గ్యాప్ తర్వాత మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మోషన్ పోస్టర్ లో మ్యూజిక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ హైలైట్ అవుతుందని చిరు ఫాన్స్ భావిస్తున్నారు. ఆచార్య టీం కు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్, ట్రైలర్, అండ్ మూవీ కోసం వేచి చూద్దాం.
'ccc' (corona crisis charity ) ద్వారా మూడోవ విడత నుండి 10,000 మంది సినీకార్మికులు కు నిత్యావసర సరుకులు ను పంపిణి చేస్తామని చెప్పారు. అంతేకాక ఎల్లప్పుడూ ప్రకటనల ద్వారా మరియు స్పెషల్ వీడియోస్ ద్వారా పబ్లిక్ ను అలెర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని మనమందరం ఆకాంక్షిద్దాం.
