
డియర్ కామ్రేడ్, మజిలీ, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో హీరో స్నేహితుడిగా నటించిన సుహాస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘కలర్ ఫోటో’. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే పూర్తవ్వగా ఇప్పుడు విడుదల కాబోతోంది. ప్రముఖ ఓ.టి.టి సంస్థ ఆహాలో ఈ సినిమా ప్రీమియర్ కాబోతోంది. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, అదే షార్ట్ ఫిలిమ్స్ నుండి వచ్చిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి సెటైరికల్ చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ కలర్ ఫోటోను కూడా నిర్మించారు.
Love, pain and more!
— ahavideoIN (@ahavideoIN) October 22, 2020
Don't have to wait much longer for #ColourPhoto.😍
Premieres tomorrow, 6 PM.@ActorSuhas @iChandiniC @SandeepRaaaj @sairazesh @Benny_Muppaneni @kaalabhairava7 pic.twitter.com/OONCPRJgV3
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 23న సాయంత్రం 6 గంటలకు ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్స్ చిత్రంపై మంచి అంచనాలను ఏర్పరిచాయి. ఈ చిత్రాన్ని ముందే చూసిన కొంతమంది సెలబ్రిటీలు కూడా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. చూడాలి మరి మొత్తానికి ఓ.టి.టిలో విడుదలైన ఈ చిత్రం ఎంతగా ఆకట్టుకుంటుందో.