ఈ నెల 4 వ తేదీన హైదరాబాద్ లోని సి-24, రోడ్ నెంబర్-8, ఫేజ్-1, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ లోని తన స్వగృహంలో సినీ నిర్మాత, షోటోకాన్ గ్రాండ్ మాస్టర్ C. రాజు గారి ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. (కాయ్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ చీఫ్ ప్యాట్రన్ గా ఎన్నికైన C. రాజు గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సినీ నిర్మాత సి.కళ్యాణ్ గారు, యువ సినీ హీరో విశ్వక్ సేన్ గారు హాజరయ్యారు, అలాగే ఈ కార్యక్రమంలో (కాయ్) రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ మాస్టర్లు , కరాటే క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వచ్చిన అతిథులందరికీ విందు ఏర్పాటు చేసారు.