
కరోన కారణంగా ఆరు నెలల లాక్ డౌన్ తర్వాత ఈ మద్యే సినిమా షూటింగ్స్ ప్రారంభమైయ్యాయి. సానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లాంటి సేఫ్టీ మెజర్స్ తో వివిధ చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. కొంతమంది నటులు ఇలా షూటింగ్స్ లో పాల్గొని మహమ్మారి కరోనా బారిన పడుతున్నారు.
కాగా ఏడు నెలల సుదీర్గ విరామం తర్వాత తను చెయ్యాల్సిన సినిమా షూటింగ్స్ కి హాజరైన మిల్కీ బ్యూటి కరోనా బారిన పడ్డారు. వారం రోజులుగా ఆవిడ ఒక హోటల్లో వెబ్ సిరీస్ కోసం జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెండ్రోజుల నుండి తలనొప్పి ఒళ్ళునొప్పులు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా ఆవిడకి కరోనా పాజిటివ్ అని డాక్టర్ల నిర్దారణలో తేలింది. ఈ తరుణంలో డాక్టర్ల సలహాలు, సూచనలు మేరకు 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. కరోనా కారణంగా ఆవిడ చేస్తున్న చిత్రాల షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆవిడ తన తల్లితండ్రుల దగ్గరే ఉంటున్నారు. ఆవిడ తన క్వారంటైన్ పూర్తైన తర్వాత వెబ్ సిరీస్ తో పాటు సీటిమార్, గుర్తుందా శీతాకాలం, అంధాదూన్ రీమేక్ చిత్రాల్లో నటించనున్నారు.