రాముడు భీముడు బాలయ్య బాబు దేవుడు.

నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని, ప్రజా జీవితాన్ని బ్యాలన్స్ చేస్తున్నారు. బాలయ్యను అభిమానులు, ప్రేక్షకులు సింహంతో పోలుస్తారు. సింహం లాగే ఆయన కూడా బోల్డ్ గా ఉంటారు. మనసులో ఉన్నదే మంచైనా చెడైనా బయటకి మొహం మీదే అనడం ఆయన నైజం. గతంలో ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. అదే కాకుండా బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ని కూడా నడిపిస్తున్నారు. ఎంతో మందికి తక్కువ ఖర్చుతో మరియు ఉచితంగా కూడా వైద్యం అందిస్తున్నారు.

కరోనా సమయలో కూడా ఆయన ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు. అంతే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రభుత్వ హాస్పిటలో సొంత ఖర్చుతో రెండు వెంటిలేటర్లు డోనేట్ చేసారు.
తాజాగా ఆయన మంచి మనస్సు తో మరోసారి హిందూపురం లో ప్రభుత్వ ఆసుపత్రి కి 55 లక్షల విలువైన మందులను , ppe కిట్లను, మాస్క్లును మరియు రోగులుకు అవసరమయ్యే పరికరాలను విరాళం గా అందించారు. బాలయ్య చేసే పనులకు ఎవరైనా జై బాలయ్య అనాల్సిందే!! ప్రస్తుతం బాలయ్య ... బోయపాటి దర్శకత్వంలో 'BB3' సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టనున్నట్టు సమాచారం..