
సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కూతురు సితార అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ తమ పిల్లల గురించి ముఖ్యంగా కూతురు సితార గురించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మరోసారి ఆయన సితార గురించి ప్రస్తావించారు. సితార కొత్త ఫొటోను షేర్ చేసి “ఈ లోకంలో కూతురు ఉండటం కంటే గొప్ప బహుమానం ఏమీ ఉండదు. తన ప్రపంచాన్ని తన శైలిలో నిర్మించుకోవాలని తాపత్రయపడుతున్న తనని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మనో ధైర్యంతో నీ కలల్ని సాకారం చేసుకుంటూ నువ్వు అనుకున్నది సాధించు” అంటూ సితారని ఉద్దేశించి మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైరల్ అయిన ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.