
జూనియర్ ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా సమంత, కాజల్ కథానాయికలుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘బృందావనం’. కోటా శ్రీనివాస రావు, ప్రకాష్ రాజ్, శ్రీ హరి, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, వేణుమాధవ్ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం 14-ఆక్టోబర్-2010వ సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కొరటాల శివ డైలాగ్స్, రచన సహకారం అందించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మన్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
It's a decade since Young Tiger @tarak9999’s biggest family entertainer #Brindavanam released! One of the most memorable shooting experience we had. Will cherish forever. @directorvamshi @MsKajalAggarwal @Samanthaprabhu2 @MusicThaman #10YearsForBrindavanam pic.twitter.com/Xr4WmlHXp4
— Sri Venkateswara Creations (@SVC_official) October 14, 2020
ఈ చిత్రం విడుదలై ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రం విడుదలైన 158 కేంద్రాల్లో 50-రొజులు, 11 కేంద్రాల్లో 100-రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విడుదలై 10 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థయిన శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ”మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన బృందావనం చిత్రం విడుదలై 10 సంవత్సరాలైంది. ఈ చిత్రం మాకు ఎన్నో మంచి అనుభవాలను పంచింది” అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.