
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో దూకుడు సినిమా మరిచిపోలేని చిత్రం. దూకుడు సినిమా సృష్టించిన దూకుడుకి బాక్సాఫీస్ రికార్డులు బద్దలై పోయాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2011లో సరిగ్గా ఇదే రోజున అంటే సెప్టెంబర్ 23న దూకుడు సినిమా రిలీజయ్యింది. ఈరోజుకు దూకుడు రిలీజై 9 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల సోషల్ మీడియాలో స్పందించారు.
దూకుడు సినిమా సెట్స్ లో ప్రతీ నిమిషం ఎంజయ్ చేసానని తన కెరీర్ లో 'సూపర్ స్టార్' మహేష్ బాబు గారు మరిచిపోలేని ఒక మైలురాయి లాంటి క్రేజీ మూవీ ఇచ్చారు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాను ఇచ్చిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీను వైట్ల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
ప్రకాష్ రాజ్ పాత్ర చుట్టూ జరిగే కథ ఇది.
ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటించింది. బ్రహ్మానందం,ఎం.ఎస్.నారాయణ చేసిన హాస్యం ఎవరూ మరిచిపోలేరు.
మహేష్ బాబు తనలో ఉన్న కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో అద్భుతంగా పండించారు.
చాలా డైమెన్షన్స్ ఉన్న తన పాత్రని తన నటనతో నిలబెట్టేసారు. థమన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించియి.