అఖిల్ అక్కినేని టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా కానీ ఆ గ్రాండియర్ తగ్గ హిట్ మాత్రం ఇంత వరకూ అందుకోలేకపోయాడు. అఖిల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ రి ఎంట్రీ తో వచ్చిన హలో సినిమా కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కానీ హిట్ కోసం అఖిల్ ప్రయత్నాలు ఆపలేదు. రీసెంట్ గా అఖిల్ కొత్త చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా తో పక్కాగా హిట్ కొడతాము అని టీం అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

దీని తర్వాత సినిమా మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ అఖిల్ సోషల్ మీడియాలో బాడీ వర్కౌట్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫోటిస్ మాత్రం ఫుల్ వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు క్లాస్ లుక్ లో కనిపించిన అఖిల్ ఇక నుండి మాస్ లుక్ లో కూడా అదరగొడతాడు అనిపించేలా ఉంది ఆ లుక్.

ఇంటెన్సిటీ మరియు హార్డ్ వర్క్ అంటూ, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తనలో ఇదే బెస్ట్.. నాకు ఇది చాలా మార్పు తీసుకురాబోతుంది.. ఏదో స్పెషల్ గా మొదలవుతుంది.. ముందు ముందు ఇంకా చాలా వస్తాయి.. అని అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
దీనితో ఇదేమైనా కొత్త సినిమా కోసమా! ఒక వేళ అదే అయితే ఆ సినిమా ఎలా ఉండబోతోంది? డైరెక్టర్ ఎవరు లాంటి అనేక సందేహాలు ఫాన్స్ లో మొదలయ్యాయి. వాటన్నిటికీ ఆన్సర్ దొరకాలంటే తర్వాత అప్డేట్ వరకు ఆగాల్సిందే!!