మోడలింగ్ లో ఫుల్ సక్సెస్ లో ఉండగా బ్రది సినిమాతో హీరోయిన్ అయింది రేణూ దేశాయ్.. తన ఫస్ట్ మూవీతోనే పవన్ కళ్యాణ్ సరసన నటించింది.. ఆతర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీరు రిలేషన్ లో ఉంటూ వచ్చి 2009 లో వివాహమాడి, 2012 లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గా ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన 16 ఏళ్ల వయస్సులో కెమెరా ముందుకు వచ్చిన మొట్టమొదటి రోజును గుర్తు చేసుకున్నారు.
అంతరిక్ష శాస్త్రవేత్త లేదా న్యూరో సర్జన్ కావాలన్న తన కలను వీడటం చాలా బాధాకరమైన నిర్ణయం అని ఆమె వెల్లడించింది, షోబిజ్ అరేనాలో తన కలను విడిచిపెట్టినందుకు ఆమెను మొదట కొన్నేళ్ళు బాధపెట్టినప్పటికీ, చిత్రనిర్మాణంలో ఆమెకున్న ఆసక్తి ఇటు వైపు అడుగులు వేసేలా చేసింది.. ఇక తర్వాత జరిగింది అంతా తెలిసిందే.
“9 సెప్టెంబర్, 1995" అని మెన్షన్ చేస్తూ ఆమె మొట్టమొదటి ఫోటో షూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. "నేను కెమెరాను మొదటిసారి ఫేస్ చేసి ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. నేను చిన్నప్పటి నుండి అంతరిక్ష శాస్త్రవేత్త లేదా న్యూరో సర్జన్ అవ్వాలనుకున్నాను మరియు నా మార్క్ షీట్లు నా కోరికలకు బలాన్ని ఇచ్చాయి. కానీ, డెస్టినీ నాకు ఇతర ప్రణాళికలను కలిగి ఉందని
తెలియజేసింది. 16 సంవత్సరాల వయస్సులో కెమెరాను ఎదుర్కొన్నప్పుడు, చలన చిత్ర నిర్మాణ ప్రక్రియతో నేను ప్రేమలో పడ్డాను. మనందరికీ తెలిసినట్లుగా మిగిలినది అంతా చరిత్ర.” అని రాసారు ఆమె పోస్ట్ లో.
ఆమె చివరిగా "మీ హృదయాన్ని ఎల్లప్పుడూ అనుసరించండి, కష్టపడి హృదయపూర్వకంగా పనిచేయండి. విజయం మరియు ఆనందం మీదేనని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను!" అన్నారు..