
కరోనా వల్ల కల్లోలంలో మునిగిపోయిన సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. థియేటర్లపై ఆధారపడే
కార్మికుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. అన్ లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లను ఓపెన్
చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలో... సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై
కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. 50 శాతం ప్రేక్షకులను మాత్రమే థియేటర్లలో అనుమతించాలని పేర్కొంది. భౌతిక
దూరం ఖచ్చితంగా పాటిస్తూ ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలని సూచించింది. ఇక ముఖమైన విషయంగా
థియేటర్లలో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కరోనా లక్షణాలు లేని ప్రేక్షకులను
మాత్రమే థియేటర్లలోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక వైరస్
వ్యాపించకుండా టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అందుకోసం రోజు మొత్తం
టికెట్ కౌంటర్లని ఓపెన్ చేసే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకి ఖచ్చితమైన గైడ్ లైన్స్ ని విడుదల
చేసింది. ఈ గైడ్ లైన్స్ ని అందరూ ఖచ్చితంగా పాటించాలని సూచించింది.