
న్యాచురల్ స్టార్ నాని తల్లి విజయలక్ష్మి పుట్టినరోజు అక్టోబర్-14న. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అమ్మగారి ఆశీర్వాదాన్ని కోరుతూ, పాదాలకి నమస్కరించి, 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ' అని రాసి ఒక ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా నాని న్యాచురల్ గానే ఉంటాడనడానికి ఇది నిదర్శనం. ఆయన ఎమోషన్స్ కీ వ్యాల్యూ ఇస్తూ ముందుకు వెళ్తుంటారు. తన సినిమాల్లో కూడా ఎమోషన్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు.
హీరోగా తను ఎంత ఎదిగినా ఆ క్రెడిట్ మొత్తం తన తల్లి విజయలక్ష్మి గారికే చెందుతుందని వినమ్రంగా చెబుతుంటారు నాని. తన ప్యాషన్ ని ముందు గుర్తించింది ఆవిడేనని, సినీ రంగంలో ఎదగడానికి ఆవిడ ప్రోత్సాహమే కారణమని చాలా సార్లు గుర్తు చేసుకున్నారు. ఆవిడ ఏడాది క్రితం వరకు వైజాగ్ లో ఉద్యోగం చేసేవారు, అంతే కాకుండా ఆర్టీసీ బస్సులోనే ఆఫీస్ కి వెళ్లేవారు. తన కొడుకు విజయవంతమైన సినీ నటుడు అయిన తరువాత కూడా ఆవిడ వైజాగ్ లో అత్యంత సాధారణమైన మధ్యతరగతి జీవితాన్ని గడిపారు. ఇప్పుడు నాని తన తల్లిదండ్రులను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు విజయలక్ష్మి గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.