Checkout the latest video of Heroine Raasi preparing Gulab Jamun at home.
ఒకప్పటి హీరోయిన్ రాశి తన గ్లామర్ తో, మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. గోకులంలో సీత, ప్రేయసి రావే లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ లో, నిజం సినిమాలో విలన్ గోపిచంద్ సరసన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించి మెప్పించింది. ఇక పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకుని, చాలా కాలం తరువాత ఈ మధ్యే నాగశౌర్య హీరోగా వచ్చిన కళ్యాణవైభోగమే చిత్రంలో ముఖ్యపాత్రలో నటించి మెప్పించింది.
ఇంతకు ముందు ముద్దుగా, బొద్దుగా ఉండే రాశి ఇప్పుడు చాలా బరువు తగ్గి చూడటానికి అందంగా ఉన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో స్లిమ్ గా, ఫిట్ గా తయారయింది. ఆమె బరువు తగ్గడాన్ని కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వారు వాణిజ్య ప్రకటనలలో కూడా బాగానే వాడుకుంటున్నారు.
అయితే రాశి ఇటీవల కాలంలో యూట్యూబర్ గా కూడా మారింది. రాశి విజన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఆదరణ పొందుతూ లక్షకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. వంటలు గురించి వీడియోలు చేస్తూ పాకశాస్త్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మున్ముందు ఏ ఏ శాస్త్రాలతో మన ముందుకు వస్తుందో చూద్దాం. అల్ ది బెస్ట్ రాశి.