క్రాక్ షూటింగ్ ను పూర్తి చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్నా అనుకోని కారణాల వల్ల జరగలేదు. కరోనా బ్రేక్ తర్వాత రీసెంట్ గా క్రాక్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ ను నిలువరించడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ ను కూడా చిత్రీకరించారు. అప్సరా రాణి ఈ ఐటెం పాటలో రవితేజకు జోడిగా నర్తించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఆవిడకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. ఈ చిత్రంలో వరలక్ష్మి జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్, రవితేజ ల కలయికలో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రం ‘క్రాక్’. కావున ఈ చిత్రంపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.