
ఈరోజు అమల గారు తన 53 వ పుట్టినరోజును జరుపుకున్నారు. 1990 లలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ దక్షిణాదిన స్టార్ స్టేటస్ చూశారు.
అమల కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. శివ, పుష్పక విమానం, ఘర్షణ, నిర్ణయం, రాజా విక్రమార్కా ఆమె నటించిన వాటిలో కొన్ని సినిమాలు. అప్పటి స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున మరియు ఇతర హీరోలతో కూడా ఆమె నటించారు.
అమల మరియు అక్కినేని నాగార్జున కిరాయ్ దాదా సినిమాలో మొదట కలిసి నటించారు. ఆ తర్వాత శివ, నిర్ణయం లాంటి సినిమాలలో కూడా కలిసి యాక్ట్ చేశారు. కొంతకాలం తర్వాత, నాగార్జున ఆమెను పెళ్లి కోసం ప్రతిపాదించాడు. అలా ఇద్దరూ 1992 లో వివాహం చేసుకున్నారు.
నాగార్జున తో పెళ్లి తర్వాత సినిమాలు విడిచిపెట్టి నాగార్జున సహాయంతో బ్లూ క్రాస్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది 400,000 జంతువులను సంరక్షిస్తూ వాటికి నివాసంగా ఉంది. జంతువులను కాపాడటానికి ఆమె చేసిన ప్రయత్నాలను 'పెటా' సంస్థ గుర్తించింది. ఆ సంస్థ వాటిని రక్షించడంలో అమలకు సహాయపడుతుంది.
ఇంత పెద్ద మంచి మనసు కలిగిన అమలగారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుక్కవలని అందరూ కోరుకుంటూ అమల గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
