
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి వియోగం తీరని లోటని సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్తపరిచారు. ప్రముఖ నటుడు చిరంజీవి గారు ట్విట్టర్ వేదికగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ విధంగా పంచుకున్నారు. ‘అయన్ని కోల్పోవటం చాల దురదృష్టం. భారతీయ సంగీత ప్రపంచానికి నేడు దుర్దినం. నాకు అత్యంత ఆప్తుడు ఆత్మీయుడు.. నేను అన్నయ్య అని పిలిచే నా కుటుంబసభ్యుడిని పోగొట్టుకున్న భావం నాకు కలుగుతోంది.
నా కెరీర్ విజయంలో ఆయనకు సింహభాగం ఇవ్వాలి. సినిమా పరంగానే కాకుండా కుటుంబపరంగాను మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నువ్వు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోతున్నావు, నీలో ఉన్న నటుడికి కూడా అవకాశం ఇవ్వాలి అని ఆయన ఇచ్చిన సలహా మేరకేనేమో నేను ఆపద్భాందవుడు , రుద్రావీణ, స్వయంకృషి, లాంటి సినిమాలో నటించగలిగాను. నేను ఇంత ఉన్నతస్థానంలో ఉండడానికి కారణమైన ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం’ అని ఆయన బాధపడ్డారు