
సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి చెందిన రాఘవేంద్ర కళ్యాణ మండపం పై చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ ఇటీవల ఆస్తి పన్ను విధించింది. 6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీనిని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు రజనీకాంత్. లాక్ డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణమండపం మూసి ఉంది. అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీకాంత్ లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీకాంత్ ని కోర్టు హెచ్చరించింది.
ராகவேந்திரா மண்டப சொத்து வரி...
— Rajinikanth (@rajinikanth) October 15, 2020
நாம் மாநகராட்சியில் மேல்முறையீடு செய்திருக்க வேண்டும்.
தவறைத் தவிர்த்திருக்கலாம்.#அனுபவமே_பாடம்
అయితే ఈ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీకాంత్ లాయర్ కోర్టును కోరారు. ఈ వివాదంపై తాజాగా రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలను వెల్లబుచ్చారు. తాను పొరపాటు చేశానని, రాఘవేంద్ర కల్యాణ మండపం ట్యాక్స్ విషయంలో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించకుండా...చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ని సంప్రదించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని, అనుభవమే పాఠం అంటూ హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. తాను హైకోర్టుకెక్కి తప్పు చేశానని అన్నారు రజినీకాంత్.