
ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నా స్త్రీని వెనక్కి నెట్టేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఎక్కడో దగ్గర ఈ సమాజంలో స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పేరుకు మాత్రమే స్త్రీ పురుషుడిలో సగం, ఆకాశంలో సగం. కానీ గౌరవించడంలో మాత్రం లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా తన వంతు బాధ్యతగా, సీరియస్ గా అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఉపాసన. “అసలు స్త్రీకి గౌరవం దక్కని చోట పూజా గది నుండి దయచేసి దేవిని తొలగించండి” అంటూ కాస్త సీరియస్ గానే అందరికీ అర్థమయ్యే రీతిలో, ఆలోచన కలిగించే విధంగా మాట్లాడారు “దేశవ్యాప్తంగా రోజూ మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దసరా శుభసందర్భంగా భారతీయులందరూ దుర్గాదేవిని ఆరాధిస్తారు కానీ స్త్రీలను గౌరవిస్తున్నారా? ఒక వేళ గౌరవిస్తే ఎంతగా గౌరవిస్తున్నారు?” అన్నదానిని ఉపాసన ప్రశ్నించారు.
Celebrate the Devi in U is a very powerful series on @urlife_co_in .
— Upasana Konidela (@upasanakonidela) October 25, 2020
Stree Shakti is something I’m very proud of.
Pls check it out, I’ve spoken from the heart.
Tune in to @sakshitv1 @Sakshitvvideos . #HappyDussehra https://t.co/yVTZVYOC6I pic.twitter.com/fiVWYxLQJq
విజయ దశమి రోజున యువతరానికి మంచి మెసేజ్ ని ఇచ్చే ప్రయత్నం చేశారు. “మన దేశం విజయవంతం కావాలంటే ఒక మగవాళ్ళే కాదు, మహిళలు కూడా విజయవంతం కావాలి. మీ ఇంటిలోని మహిళలను ఎలా గౌరవించాలో మీకు తెలియకపోతే దయచేసి మీ పూజ గది నుండి దేవిని తక్షణమే తొలగించండి. పురుషులు రాముడిలాగా ఉండలేనప్పుడు, మహిళలు సీతగా ఉండాలని వారు ఎందుకు ఆశిస్తారు? ప్రతీ స్త్రీని దేవతలా పూజించాలి. స్త్రీల జీవితాలను ఎప్పుడూ ఒకేలా కాకుండా వారిని మరో కోణంతో చూడండి వారిని సహానుభూతితో అర్థం చేసుకుంటారు” అని సోషల్ మీడియా ద్వారా ఉపాసన తన ఆవేదనను వ్యక్తపరుస్తూ, తనవంతుగా ప్రజలకి మంచి విషయాలని, నిజాలని నిర్భయంగా తెలియజేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన కామినేని కొణిదెల.