2020 లో ఐపీఎల్ జరుగుతుందా అనే స్థాయి నుండి ఫస్ట్ మ్యాచ్ తోనే రికార్డ్ స్థాయి వివర్షిప్ వరకూ వచ్చేశాం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవతో ఈ సీజన్ ఐపీఎల్ దుబాయ్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై ముంబై మధ్య అనగానే ఫాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. 200 మిలియన్ వ్యూస్ తో ఆ మ్యాచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే ఈ సారి జరిగే ఐపీఎల్ మాత్రం చాలా ఉత్కంఠ పరిస్థితులులో ప్రారంభమైంది అని చెప్పాలి.. ధోనీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆడుతూ ఉండటం.. పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ తర్వాత, ఐపీఎల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు మధ్య మొదలు అవడంతో ధోనీ ఫ్యాన్స్ కి పండగలాగా ఉంది.. అలాగే కోహ్లీ సేన బెంగుళూర్ టీం ఇంత వరకూ ఒక్క కప్ కూడా గెలవలేక నిరాశ పరిచారు.. ఈ సారి అయినా ఆశ నెరవేరుతుంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్, ముంబై కి ఉండే ఫ్యాన్స్ తమ తమ అభిమాన టీం కప్ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఫేవరేట్ ప్లేయర్ ఉన్న టీమ్ ని సపోర్ట్ చేస్తూ కొంత మంది, హోమ్ గ్రౌండ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ ని సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది.. ఇక బెట్టింగ్ లు సరేసరి.. బుకీలు, డ్రీమ్ 11 లో వాళ్ళ గోల వాళ్ళది. ఇలా కరోనా తో డీలా పడిపోయిన జనాల్లో ఐపీఎల్ కొత్త ఉత్సాహం నింపింది జనాల్లో..
అయితే ఈ సందడిని మరింత వేడెక్కించేలా మన రేడియో మిర్చి వారు హాట్ హాట్ గా ఒక ఐపీఎల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. "Valeh valerie" పేరుతో ఉన్న ఈ క్రికెట్ యాంతమ్మ్ ని యూట్యూబ్ లో "మిర్చి తెలుగు" ఛానెల్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. రేడియో మిర్చి వారు చేసిన ఈ సాంగ్ కి "భారతి సిమెంట్స్" వారు కూడా అసోసియేట్ అయ్యారు.
"సెలూన్ షాప్ నుండి సాఫ్ట్వేర్ దాకా క్రికెట్టే క్రేజీరో.. చాయ్ బండి నుండి చార్మినార్ దాకా వికెట్ల మోతేరో.." లాంటి లిరిక్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి.. గల్లీ క్రికెట్, సిటీస్ లో క్రికెట్ కి ఉండే క్రేజ్, కూలీల నుండి సినిమా స్టార్స్ వరకూ క్రికెట్ కి ఉండే ఫాలోవింగ్.. ఇలాంటివి అన్నీ విజువల్ గా బాగా చూపించారు సాంగ్ లో. మ్యూజిక్, క్వాలిటీ ఇలా అన్నిరకాలుగా కూడా సాంగ్ చాలా బాగుంది.
భారతి సిమెంట్స్ మరియు రేడియో మిర్చి వారు అందించిన ఈ క్రికెట్ యాంతమ్, తెలుగు వారికి ఐపీఎల్ తో పాటు మరింత ఉత్సాహాన్ని, ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది..