
ఒకప్పుడు చిన్న సినిమాలతో ఫామిలీ హీరో గా చాలా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు గారు, ప్రస్తుతం మాత్రం సౌత్ ఇండియాలో విలన్ క్యారెక్టర్ అంటే ఆయన గుర్తొస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయనే నెగటివ్ రోల్ లో ఎంపిక చేస్తున్నారు. దీనివల్ల ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువని అపోహలున్నాయి కాకపోతే ఆ అపోహలకి జగపతి బాబు గారు ఫుల్ స్టాప్ పెట్టారు. అది ఎలాగంటే ఈమధ్య ఆహ లో విడుదలైన కలర్ ఫోటో సినిమాని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. కలర్ ఫోటో సినిమా తననెంతగానో ఆకట్టుకుందని, టీం అంతా చాలా బాగా పని చేసిందని, ఒక సినిమా విజయవంతం కావడానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్టే అవసరం లేదని 'కలర్ ఫోటో' రుజువు చేసిందని అన్నాడు. ఇలాంటి యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి సృజనాత్మకతతో సినిమాలు చేస్తూ వేగంగా దూసుకెళ్తుంటే.. తన లాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని ఇలాంటి సినిమాల్లో తాను కూడా భాగం అయితే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాల్లో తాను నటించను అనో, లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను అడుగుతుండకపోవచ్చని కానీ ఆ రెండూ అబద్ధమే అని చెప్పారు. కలర్ ఫోటో సినిమాని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ చాలా బాగుందని ప్రశంసించారు. కానీ జగపతి బాబు గారి లాంటి సీనియర్ హీరోస్ కూడా ఈ సినిమాని పొగడ్తల్లో ముంచెత్తడంతో ఈ సినిమా మీద అందరి చూపు మళ్లింది.