
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు సింహా కొడూరి హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఇంతకు ముందు సింహా నటించిన `మత్తు వదలరా` సినిమా మంచి ప్రశంసలు పొందింది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి కూడా మంచి పేరు తీసుకువచ్చింది. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు సింహా కోడూరి. ఆ చిత్ర విజయంతో మరి కొన్ని సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించబోతున్నారు.
Finally back at it again! Here’s Our team 🔥- @kaalabhairava7 @Benny_Muppaneni @gellimanikanth @NarangMisha , Chithra Shukla, @sureshragutu1 Produced by @VaaraahiCC and @Loukyaoffl @SaiKorrapati_ @Benny_Muppaneni pic.twitter.com/4hBBKMSs3N
— Sri Simha Koduri (@simhakoduri2302) October 25, 2020
ఈ చిత్రానికి మణికాంత్.జె దర్శకత్వం వహిస్తున్నారు. బెనెర్జీ ముప్పనేని, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ చిత్ర కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టాగా ఎం.ఎం. కీరవణి స్క్రిప్ట్ ను అందజేశారు. పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. శ్రీ సింహాకు జోడిగా చిత్ర శుక్లా, మిషా నారంగ్ లు నటిస్తున్నారు. సురేష్ రగుటు ఛాయాగ్రహకుడు, మత్తు వదలరా చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎం.ఎం.కీరవాణి మొదటి కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు.