
‘విక్టరీ వెంకటేష్’, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రధారులుగా
ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘జయం మనదేరా’. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ
సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ చిత్రం విడుదలయ్యి నేటికి 20 సంవత్సరాలు అయ్యింది.
ఆక్టోబర్,07 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించి ప్రేక్షకాధరణ పొందింది. 149
కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 104 కేంద్రాల్లో 50 రోజులు, 34 కేంద్రాల్లో 100 రోజుల, పాటు విజయవంతంగా
ప్రదర్శితమైంది. విడుదలైన తోలి వారంలో మూడు కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ చిత్రం విడుదలై నేటికి 20సంవత్సరాలైన సందర్బంగా పలువురు సినీ పెద్దలు, అభిమానిలు చిత్ర బృందానికి
అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు ‘విక్టరీ వెంకటేష్’ తన ట్విటర్ ఖాతాలో ఈ విధంగా
పోస్ట్ చేసారు, “ జయం మనదేరా చిత్రం విడుదలై 20 సంవత్సరాలైన సందర్బంగా చాలా సంతోషంగా ఉంది. గొప్ప
అనుభవాన్ని, మంచి అనుభూతిని పంచిన ఈ చిత్రంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. నేను ఈ స్థానంలో
ఉండడానికి కారణమైన నా అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.” అని ఆయన ట్వీట్ చేసారు.