
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రాధే శ్యామ్ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న విషయం తెల్సిందే. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా ప్రభాస్, పూజ హెగ్డేలపై కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ను ఇప్పుడు జరుపుతున్నారు. ఇది 1960వ కాలానికి చెందిన యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఒక హృద్యమైన ప్రేమకథగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. రాధే శ్యామ్ లవ్ స్టోరీ కాబట్టి సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో మొదటినుండి సస్పెన్స్ నెలకొని ఉంది. మొత్తానికి అది ఇప్పుడు వీడింది. ఈ సినిమాకు డియర్ కామ్రేడ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జస్టిన్ ప్రభాకరన్ పనిచేస్తున్నట్లు సమాచారం. డియర్ కామ్రేడ్ చిత్రంలో మెలోడీలు చాలా ఫేమస్ అయ్యాయి. భారీ స్థాయి విజయాన్ని సాధించాయి. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ సినిమాకు పనిచేసే అవకాశం ప్రభాకరన్ కు కలిగింది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వివిధ భారతీయ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.
Happy to part of this wonderful project #radheshyam Need your prayers and support😊 Thank you so much #Prabhas sir @director_radhaa bro@UVKrishnamRaju garu @hegdepooja @UV_Creations @TSeries#Vamshi garu #Pramod gar & @PraseedhaU #BhushanKumar @AAFilmsIndia @GopiKrishnaMvs pic.twitter.com/2E5piUU4xy
— Justin Prabhakaran (@justin_tunes) October 21, 2020